News

నయీం డైరీలో అధికారుల పేర్లు


నయీం డైరీలో చర్లపల్లి జైలు అధికారుల పేర్లు వెలుగు చూశాయి. డైరీలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజమహేష్‌, జైలర్‌ దేవుల పేర్లు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజమహేష్‌ను 4 గంటలపాటు సిట్‌ అధికారులు విచారించారు. రాజమహేష్‌కు రూ.27 లక్షలు ఇచ్చినట్టుగా నయీం డైరీలో రాసుకున్నాడు. 2013లో నల్గొండ జిల్లా జైలు అధికారిగా రాజమహేష్‌ పనిచేశాడు అదే సమయంలో మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య కేసులో నయీం నల్గొండ జైలులో ఉన్నాడు.ఖైదీలుగా ఉన్న నయీం అనుచరులకు రాజమహేష్‌ రాజభోగాలు కల్పించాడు. ఈ కేసులోసిట్‌ అధికారులు బలమైన ఆధారాలు సేకరించారు. రాజమహేష్‌ను ఏ క్షణమైనా సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేయవచ్చు.